ఆంధ్రప్రదేశ్ నూతన సి యస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ నూతన సిఎస్ గా 1987 బ్యాచ్ కీ చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ భాద్యతలు చేపట్టారు.
వెలగపూడి సచివాలయం లోని మొదటి బ్లాక్ లోని CS చాంబర్ లో ఛార్జ్ తీసుకున్నారు.
భాద్యతలు చేపట్టిన అనంతరం నూతన సీఎస్ ను టిటిడి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వేద పండితులు ఆశీర్వదించారు. నూతన సీఎస్ కు వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సీ ఎస్ నీ రబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు.
సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తాను అని తెలిపారు.
ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలకు కృషి చేస్తాను అని చెప్పారు.......
ఈ కార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సిఎస్ గోపాల కృష్ణ ద్వివేది,పిసిసిఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి,ఐటి కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.