జనసేవ న్యూస్ :ఆనందపురం
తమ ఫెడరేషన్లో విజయనగరం జిల్లా ఆర్ ఎంపీలకు సముచిత స్థానం దక్కినట్లు జోనల్ అధ్యక్షుడు జంగంజోషి చెప్పారు.
ఆయన ఆనందపురం లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎంపీలు బాధ్యతతో పని చేయాలని సూచించారు. అనంతరం ఫెడరేషన్ వివరాలందించారు.
అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీలో జరిగిన రాష్ట్ర, ఆర్.ఎం.పి, అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య. ఫెడరేషన్ నిర్వహించిన విశిష్ట కార్యనిర్వాహణ నాయకుల సమావేశంలో.
జిల్లా వాసులైన గెద్ద చిరంజీవికి రాష్ట్ర సమాచార కార్యదర్శిగా ,
పి.కనక చార్య కు, క్రమశిక్షణ కమిటీ కార్యదర్శిగా.
ఉమా శంకర్ కు,రాష్ట్ర డెవలప్మెంట్ కార్యదర్శిగా, అల్లాడ త్రినాధ రావు కు కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి గా,
నాగరాజు కు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, గౌరీ నాయుడు కు రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా,
కు ఎన్నిక చేసి, జిల్లాలో పలువురు నేతలు నాయకులకు కీలకమైన సముచిత స్థానాన్ని ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షుడు జంగం జోషి కల్పించారు.
ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, రాజా సిద్ధార్థ, కంబాల బాబు రావు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు . రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి జంగం జోషి , మాట్లాడుతూ, ఎన్నికైన వీరు జిల్లా నలుమూలల ఆర్ఎంపి/పి ఎన్ పి లను వారిలో ఐక్యతను పెంపొందించడం, ఎప్పటికప్పుడు వైద్య మార్పులను, విధానంలో వారి వారి పరిధిలో తెలియజేయటం, సమాజానికి, ప్రభుత్వ వైద్య వ్యవహారాలలో స్వచ్ఛందంగా, పనిచేసే విభాగాలుగా పని చేస్తాయని వారు తెలిపారు, స్థానిక సంఘ నాయకులు, జిల్లా కార్యదర్శి ఏ.ఎ.ఎన్ .శర్మ , రామమూర్తి రాజు, మహిళా కార్యదర్శి సోమేశ్వరి, కలాం టెస్ట్ కన్వీనర్ మమ్ముల తిరుపతి రావు జోనల్ కార్యదర్శి,గోపాలరావు, శుభాకాంక్షలు తెలిపారు.