ఆనందపురం:జయజయ హే
స్థానిక గ్రామ సచివాలయంలో సర్పంచ్ చందక లక్ష్మి అధ్యక్షతన ఉపాధి హామీ పథకం పై సమీక్ష జరిగింది.
ఉపాధి పనులు పగడ్బందీగా జరిగేందుకుగాను చంద్రకళ లక్ష్మి కమిటీలను వేశారు. ప్రతి 40 మందికి ఒక మేట్
ను ఏర్పాటు చేశారు.
అలా ఈ కమిటీలో 50 మంది మేట్లను నియమించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చందక లక్ష్మి మాట్లాడుతూ ప్రతి మేట్ కు ప్రభుత్వం ఆండ్రాయిడ్ మొబైల్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
అలాగే పనిలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఏడు రూపాయలు ప్రభుత్వం మేట్ ఎకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు.