అట్టహాసంగా జర్నలిస్ట్ గృహప్రవేశం హాజరైన అతిరథమహారధులు

ఆనందపురం:జయ జయ హే
          స్థానిక హైస్కూల్ వద్దగల జర్నలిస్ట్ కాలనీ లో జరిగిన గృహప్రవేశానికి మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. 
ఇక్కడ సుమారు పది మంది జర్నలిస్టులకు 100 చదరపు గజాల చొప్పున గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇండ్ల స్థలాలు కేటాయించింది. అయితే వీటికి పట్టాలను అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. 

20 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యకు   గంటా శ్రీనివాసరావు చొరవతో ఎట్టకేలకు సాధ్యమయింది. అయితే ఈ కాలనీ లో మొట్టమొదటి గృహప్రవేశంగా స్థానిక ప్రజాశక్తి విలేకరి దొంతల శ్రీనివాసరావుది కావడం గమనార్హం.కాగా ఎమ్మెల్యే గంటా కు   భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు, వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ల నాయకత్వంలో పార్టీ కేడర్ అంతా 35 కార్లలో భారీ కాన్వాయ్ కు గంటా కు ఆహ్వానం పలికారు. 

అనంతరం ఆయన జర్నలిస్ట్ దొంతల శ్రీనివాసరావు, ఆయన సతీమణి వరలక్ష్మీ లకు కలుసుకొని  అభినందించారు.  

అలాగే ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తరఫున అతని సోదరుడు, భీమిలి ఇంచార్జ్ ముత్తంశెట్టి మహేష్ అనుచరులు హాజరై గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. 

అదేవిధంగా ఆనందపురం ప్రెస్ క్లబ్ నుండి మహంతి శివాజీ, జి రవికిషోర్ పట్నాయక్, డబ్బీరు విజయ్ కుమార్, రెడ్డి లక్ష్మణ్ రావ్  తదితరులు హాజరయ్యారు.

జి రవి కిషోర్ బ్యూరో చీఫ్