*ఆనందపురం* : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలక్టరేట్ ముట్టడి "ఛలో కలక్టరేట్" కార్యక్రమంలో భాగంగా తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ ను ఆనందపురం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలని, పెంచిన రిటైర్మెంట్ వయస్సు తగ్గించాలని ప్రధానమైన డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో తెలుగునాడు విద్యార్థి సమైక్య, తెలుగు యువత, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఎఐవైఎఫ్, పివైఎల్ మరియు ఇతర విద్యార్థి సంఘాలు తో కలిసి శాంతియుతంగానే పోరాటం చేస్తున్నామని
, దోపిడీలు- దౌర్జన్యాలు కాదు అని, దాడులు అంతకంటే కాదు అని కేవలం నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నాము అని ఆయన అన్నారు.
జగన్ గారికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను, యువత ను ఆదుకోవాలన్నారు.