మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

*సాలూరు* : 

మండలంలోని మావుడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ రోజు విశిష్టతను తెలియజేస్తూ వినూత్న ప్రదర్శన చేశారు. 
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆయలసోమయాజుల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ఈ తేదీ యొక్క ప్రత్యేకత ఎటువైపు చూసినా ఒకే విధంగా కనబడుతుంది అని దీనిని పాలిన్ డ్రోమ్ సంఖ్య అని పిలుస్తారు అన్నారు. 

వ్యాయామ ఉపాధ్యాయుడు కొవ్వాడ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఇలాంటి తేదీలు చాలా అరుదుగా వస్తాయి అని, ఇంత అద్భుతమైన తేదీ రావటానికి దాదాపు వంద సంవత్సరాలు పడుతుందని, అందుకోసమే విద్యార్థుల అందరకీ ఈ తేదీ గుర్తు ఉండాలి అని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశామన్నారు. 

అనంతరం విద్యార్థుల చేత 22022022 అనే ఆకారంలో యోగాశనాలు ద్వారా ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

 ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్