కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన

పత్రికా ప్రచురణార్థం

కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన

జిల్లా పరిషత్ తాటితూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉద్యోగాల కొరకు కెరీర్ గైడెన్స్ ను ప్రారంభించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ కెరీర్ గైడెన్స్ వీక్ ను ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తుందని, ఇది విద్యార్థులకు  వరం అని రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకండరీ స్థాయి విద్యార్థులు చదువుతోపాటు భవిష్యత్తులో వాటి ద్వారా పొందబోయే ఉద్యోగాలు గురించి తెలియజేస్తున్నారు అని అన్నారు .
 ఏపీ కెరియర్ పోర్టల్ లో వివిధ రకాల నోటిఫికేషన్లు ఫీజులు , పరీక్షలు , కోర్సుల వివరాలు,  చివరితేదీ , జీతం,  ఉపకార వేతనాలు,  తదితర అంశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇవే కాకుండా వీటితో పాటు వృత్తి విద్యా కోర్సుల వివరాలు, మనకు నచ్చిన ఉద్యోగం గురించి పోర్టల్ లో తెలుసుకోవచ్చని తెలిపారు,  వాటితోపాటు వ్యవసాయం, అందం, ఆరోగ్యం,  ఈ విధంగా 64 కళలకు సంబంధించిన పోస్ట్ లు ఉంటాయని తెలిపారు.
ఈ కెరీర్ గైడెన్స్ కు పాఠశాల ఉపాధ్యాయులు టి. ఎస్.వి. ప్రసాదరావు కెరీర్ గైడ్ గా వ్యవహరిస్తారని తెలిపారు.

కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్  టి .ఎస్. వి.  ప్రసాదరావు మాట్లాడుతూ నానాటికీ పోటీ తీవ్రమవుతున్న ప్రస్తుత వాతావరణం లో దానిని ఎలా చేరుకోవాలో తెలియక సతమతమవుతున్న ఎందరో విద్యార్థులు మనోవేదన గురించి తెలియజేస్తూ అనుకున్న ఉద్యోగం సాధించడానికి ఏమి చదవాలి ? ఆ కోర్స్ లో ఎలా చేరాలి ? ఆ ఉద్యోగానికి డిమాండ్ ఉందా ?  జీతభత్యాలు ఎంత ఉంటాయి ?  అందుబాటులో ఉన్న కోర్సులు ఏమిటి ?  పదవ తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా ? ఇలా రకరకాల ప్రశ్నలు వేధిస్తున్న అర కొర సమాచారంతో ఆందోళన చెందుతుంటారు,  విద్యార్థులు ఎవరి సహాయం లేకుండా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రభుత్వము ప్రతి పాఠశాలలో కెరియర్ గైడెన్స్ నిర్వహిస్తుందని తెలిపారు. 

 కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు

  14వ  తేదీన విద్యార్థి కుటుంబంలో ఉన్న వృత్తులు రోల్ మోడల్ గురించి వివరించి ముందస్తు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు .
15వ  తారీఖున విద్యార్థి బలాలు వాటిని ఉపయోగించుకొనే విధానం,  అతనికి ఇష్టమైన రంగాన్ని అంచనావేసి సొంతంగా అవగాహన పొందేలా మార్గదర్శనం చూస్తామని చెప్పారు .
16 వ తారీఖున కెరీర్ కోడ్ పరీక్ష నిర్వహిస్తామని,
 17న వృత్తులకు సంబంధించిన విద్యాపరమైన సమాచారం ,జాబ్ కార్డులు, కెరీర్ ని ఎంచుకొనే విధానం చెబుతామని తెలిపారు.
 18న విద్యార్ధి భవిష్యత్తు ప్రణాళిక  తన ప్రత్యేకతను చాటుకున్న విధానంపై వివరిస్తామని తెలిపారు

 ఈ ఏపీ పోర్టల్ లో లైఫ్ స్కిల్స్, మరియు 672 రకాల ఉపాధి అవకాశాల్లో విద్యార్థులు నచ్చిన అవకాశం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు . భవిష్యత్తులో ఏం కాదలుచుకున్నమో విద్యార్థి దశలోనే గుర్తిస్తే ఉన్నత స్థానానికి ఎదగవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ, అప్పలనాయుడు, సునీత, శ్రీనివాసరావు, శేఖర్, గణేష్ ,విజయ్ కుమారి, కామేశ్వరి శ్రీదేవి , తదితరులు పాల్గొన్నరు.