త్వరలో విడనున్న సినిమా టికెట్స్ రేట్ల సందిగ్దత

ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. ఇవాళ నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. వారం రోజుల్లో దీని పై సందిగ్దత విడనుందని, 
అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగు ఫిలించాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు. గతంలో పెట్టిన ప్రతిపాదనల్నే.. 

కమిటీ ముందు ఉంచామనీ. అన్నీ చర్చించి కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

సినిమా పెద్దలు, సీఎం భేటీ సందర్భంగా మాట్లాడిన విషయాలు కూడా ఇవాళ భేటీలో చర్చకు వచ్చినట్టు.

 చాంబర్‌ సభ్యులు తెలిపారు. అటు ఆడియన్స్‌, ఇటు ఇండస్ట్రీకి మంచి జరిగేలా. అతిత్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‏లో సినిమా టికెట్స్ ధరల అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ ప్రముఖులకు.. ప్రభుత్వ అధికారులకు మధ్య చర్చలు జరిగాయి. 

తాజాగా ఇవాళ మరోసారి సినిమా టికెట్స్ ధరలపై భేటీ జరిగింది. ఇందులో సినిమా టికెట్స్ ధరలపై తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.