*శ్రీ హరికోట* : భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
వాతావరణం అనుకూలిస్తే ఈనెల 14న ఉదయం 5 గంటలా 59 నిమిషాలకు రాకెట్ దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సి-52 వాహక నౌక ప్రయోగించనున్నారు.
వాహకనౌకలో 4 దశల అనుసంధానం పూర్తిచేసుకుంది. కోవిడ్ సవాళ్లను అధిగమించి ఈ ఏడాదిలో తొలి ప్రయోగం సోమవారం జరగరబోతోంది. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ఇవాళ వేకువజామున 4.29 గంటలకు ప్రారంభించారు.
నిరంతరాయంగా 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగిన తర్వాత వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌శాట్-1-ఏతో పాటు ఐఎన్ఎస్-2-టి.డి, విద్యార్థులు రూపకల్పన చేసిన
ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలు అంటే మొత్తంగా మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనుంది పీఎస్ఎల్వీ.
ఇక శ్రీహరికోటలో ఈ ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డా. ఎస్ సోమ్‌నాథ్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు.