అక్రమ బెల్ట్ షాపులు నడుపుతున్న వారు పై దాడులు ఇద్దరు వ్యక్తులు అరెస్టు 18 మద్యం సీసాలు స్వాధీనం

 భీమునిపట్నం జనసేవ : 

               స్థానిక  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి)  సర్కిల్  ఇన్స్పెక్టర్ వి.రామకృష్ణ ఆదేశాల మేరకు ప్రొఫెషన్ & ఎక్సైజ్ ఎస్ ఐ డి పద్మావతి తమ సిబ్బందితో కలిసి అక్రమంగా మద్యం నిర్వాహకులపై దాడులు నిర్వహించారు. 

                 సోమవారం  దాడులు నిర్వహించగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించి  పి &ఈ ఎస్ఐ డి. పద్మావతి  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 
                 పద్మనాభం మండలం గందవరం గ్రామానికి చెందిన  జుత్తుక కృష్ణ కుమారుడు జుత్తుక ఎర్రి నాయుడు నుండి 10 మద్యం సీసాలు అదే గ్రామానికి చెందిన యిక్క అప్పలస్వామి కుమారుడు యిక్క అప్పారావు వద్ద నుండి 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వారి ఇద్దరు ను అరెస్టు  చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు .
    
                  అలాగే పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్  ముందున్న పాత నేరస్తులను స్థానిక మండల మెజిస్ట్రేట్ (తహసీల్దార్) ముందు హాజరు పరిచి వారు మరలా నేరములకు పాల్పడకుండ వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు .

                 ఈ దాడులలో ఎస్ఐ పద్మావతి సిబ్బంది సీఐ వి రామకృష్ణ ఆదేశాల మేరకు  దాడులు నిర్వహించారు

భీమిలి రిపోర్టర్
 పి శ్రీనివాసరావు