నిమోనియా బాధితురాలకి ఓ ఎస్ జి చేయూత

ఆనందపురం:జనసేవ న్యూస్ 
నిమోనియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి
 ఓ ఎస్ జీ ఫౌండేషన్(బోయపాలెం) ఆధ్వర్యంలో చేయూత నందించారు. విశాఖపట్నం గాజువాక కు చెందిన గుబ్బల
సాయి ఆశ్విత ( 3) కి 8నెలల వయసు ఉన్నప్పటినంచి నిమోనియా వ్యాధితో బాధపడుతున్నది.  

తల్లి గుబ్బల సుప్రియ హాస్పిటల్ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నారు.సుప్రియ అనివార్య కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంటూ పాపతో జీవనం గడుపుతున్నారు. చాలీచాలని వేతనంతో పాప చికిత్సకు  ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ప్రస్తుతం పాపకు అనారోగ్యంతో వేలాది రూపాయలు ఆస్పత్రి ఖర్చు అవుతున్నది.ఈ మేరకు ఓఎస్ పౌండేషన్ చేయూత గా నిలబడి 20 వేల ఐదు వందల రూపాయలు దాతల సహకారంతో సేకరించి పాప తల్లి సుప్రియ కు అందజేశారు.

తమ పౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు తలసేమియా వ్యాధి గ్రస్తులకు బ్లడ్ డొనేషన్, చేయూత కార్యక్రమం అందజేస్తున్నట్లు ఓ ఎస్ జి పౌండర్ ద లాయి శివ పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో పౌండేషన్ ప్రతినిధులు సతీష్,  చంద్రశేఖర్, మూర్తి, వరహాలు ,త్రినాధ్ సాయి యుగంధర్ పాల్గొన్నారు.