సమాజ హితం కోసం జర్నలిస్టులు కీలకంగా వ్యవహరించాలి

- భీమిలి సీఐ జీ.వి .రమణ* 

 *(భీమునిపట్నం - జనసేవ న్యూస్

విలువలతో కూడిన పాత్రికేయుల సేవలు సమాజహితానికి తోడ్పడతాయని భీమిలి  సీఐ జీ.వి.రమణ అన్నారు. గురువారం ఉదయం భీమిలి పోలీస్ స్టేషన్లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  భీమిలి యూనిట్ ఆధ్వర్యంలో డైరీని  ఆవిష్కరించారు.

 ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి పాత్రికేయుల సేవలు ఏంతో అవసరమని, అలాగే సమాజ హితం కోసం జర్నలిస్టులు కీలకంగా వ్యవహరించాలన్నారు. 

జర్నలిస్టుల సంక్షేమం తో పాటుగా సమాజ సేవ కై కృషి చేస్తున్న ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ సేవలు అభినందనీయమని కొనియాడారు.

 ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ ను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవకు జర్నలిస్టులు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.

ఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్  అసోసియేషన్ పేరిట జర్నలిస్టులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సీఐ జీ.వి.రమణకు వివరించారు. 

ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్లాజీ రావు, కార్యవర్గ సభ్యులు ఎమ్.పి.ఏ. రాజు, భీమిలి యూనిట్ సభ్యులు గిడుతూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.