లండన్ జూమ్ ట్విన్ సమావేశం లో పేట విద్యార్థులు

*పాయకరావుపేట* :
                కే.హెచ్.వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో హ్యూటగ్యాజి క్లాస్ అయిన నాలుగవ తరగతి  తో లండన్ లోని రివర్లీ ప్రైమరీ స్కూల్ ట్విన్ చేస్తూ ఈ రోజు మొదటి  జూమ్ సెషన్ జరిగింది.
              
                ఈ కార్యక్రమంలో రివర్లీ ప్రైమరీ స్కూల్ హెడ్ టీచర్ సబ్రీనా రీలి, అసిస్టెంట్ హెడ్ టీచర్ కిరిస్టీ ఫ్లెట్చర్ మరియు వారి ఐదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. 

                 ఈ ప్రాజెక్టు ఒక సంవత్సరం పాటు కొనసాగనుంది. ఈ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ కలెబ్రేషన్  ద్వారా లండన్ విద్యా పద్ధతులు, వినూత్న ప్రక్రియలు ఇక్కడి విద్యార్థులు నేర్చుకుంటారు. 

                 అలాగే ఇక్కడి హ్యూటగ్యాజి విధానాన్ని వారు నేర్చుకుంటారు. ట్విన్ ప్రక్రియ చాలా ఉపయోగకరమని, క్రాష్ కల్చరల్  లెర్నింగ్ వలన విద్యార్థులకు వివిధ దేశాల గురించి తెలుస్తుందని మండల విద్యాశాఖాధికారి శ్రీ కే ఎన్ గాంధీ ప్రశంసించారు. 

                 ఈ జూమ్ మీటింగ్ కు ప్రపంచంలోనే మొదటి పేరెంట్ హ్యూటగ్యాజి పుస్తకం రాస్తున్న శ్రీమతి ప్రత్యూష, హిందీ టీచర్ శ్రీమతి జ్యోతి పాల్గొన్నారు. 

                విద్యార్థులు వారి స్కూల్ ను విర్టువల్ టూర్ ద్వారా చూసారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ట్వినింగ్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ట్వినింగ్ ప్రక్రియకు కృషి చేసిన ఫ్రెడ్ గార్నెట్, ఎఫ్ఆర్ఎస్ఏ  కు ఈ సందర్బంగా హ్యూటగ్యాజి టీచర్ శ్రీమతి విజయభాను కృతజ్ఞతలు తెలియజేశారు.