ఎస్.బి.ఐ సర్వీస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలికోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ డిమాండ్


ఆనందపురం : జనసేవ న్యూస్
 మండలంలోని వేములవలస లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని టిడిపి యువ నాయకుడు, స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు.  
బ్యాంకు కార్యకలాపాలకు నిత్యం ఎంతో మంది వస్తుంటారు అని వారే గాక తగరపువలస, పెద్దిపాలెం, వెల్లంకి గ్రామాల నుండి కూడా భారీ వాహనాలు ద్విచక్ర వాహనాలు తిరుగుతూ ఈ సర్వీస్ రోడ్డు రద్దీగా ఉంటుందన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ రోడ్డు ను ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి అన్నారు. 

గతంలో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 20 మంది వరకు చనిపోయారు అన్నారు. అలాగే ప్రతిరోజు వాహనాలు ఢీకొని చాలా మంది క్షతగాత్రులు అవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే స్పందించి ఈ రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ కోరుతున్నారు.

 జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్