వసతులపై బిజెపి ఆరా!

జనసేవ న్యూస్ : సింహాచలం
బిజెపి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిశీలన కార్యక్రమం జరిగింది. 

సింహాచలం మండలం, అడవివరం లో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలికవసతుల పరిశీలన మరియు పాఠశాలలో ఉన్న సమస్యల గురించి ప్రధాన ఉపాధ్యాయులు గారిని కలిసి చర్చించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు అయినా బసవన్న అప్పలనాయుడు  అధ్యక్షత వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా మెంబర్ అయిన  వేమూరి మహేష్ , విశాఖ జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ అయిన పురుషోత్తం , గన్నవరపు సూర్యనారాయణ , మండల ప్రధాన కార్యదర్శి అయిన శరత్ , మండల ఉపాధ్యక్షులు అయిన షణ్ముఖ పాల్గొనడం జరిగింది.