"టీం తారక్ ట్రస్ట్" క్యాలెండర్ ఆవిష్కరణ

 *మధురవాడ* : మధురవాడ లో గల కృప సాధన అనాధ ఆశ్రమం లో  టీం తారక్ ట్రస్ట్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

       ఈ సందర్భంగా ఆశ్రమం లో ఉన్న పిల్లల చేత విశాఖపట్నం టీం తారక్ ట్రస్ట్  సభ్యులు ఓలేటి శ్రావణ్, లెంక సురేష్, తిరుపతి సాయి కుమార్, నాగిశెట్టి సురేంద్ర 2022 కు సంబంధించిన క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఒక మంచి ఆలోచన తో నిర్వహకులు తమ అభిమాన హీరో పేరు మీద ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని,

          ఈ విధంగా వినూత్నంగా ఆలోచించి అనాధ పిల్లల చేత ఆవిష్కరణ చేయించడం శుభపరిణామం అని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు విశాఖ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ప్రోత్సాహం మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే ఉత్సాహాన్ని కలిగించేలా చేస్తున్నారని తెలిపారు.

 అనంతరం ఆశ్రమంలో గల పిల్లలకు పెన్సిళ్లు, బిస్కెట్లు, చాక్లెట్ లు పంపిణీ చేశారు.