ఆనందపురం: జనసేవ న్యూస్
మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని ప్రధాన వక్త టిడిపి సీనియర్ నాయకులు, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు అభివర్ణించారు. సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ తర్వాత తరానికి కూడా దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.
ఇందులో భాగంగా వేములవలస పంచాయతీలో స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ వేములవలస పూల మార్కెట్, పోలీస్ స్టేషన్ వద్ద గల దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అందరూ అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ కోరారు. కిలో రూపాయికే రేషన్ బియ్యం పథకం పెట్టి అన్నార్తులకు సేవలు అందించారన్నారు.
దేశంలోనే ఈ పథకం మచ్చుతునకగా మారిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన సంక్షేమ ఫలాలను ప్రస్తుతం జగన్ రెడ్డి ప్రభుత్వం విస్మరిస్తుంది అన్నారు.
ఈ నేపథ్యంలో పేద మధ్య తరగతి వర్గాల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని జ్ఞానేశ్వర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎల్.వి పాలెం మాజీ సర్పంచ్ బమ్మిడి సూర్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ మీసాల సత్యనారాయణ, ఎంపీటీసీ పడాల అప్పలనాయుడు (వెల్లంకి),కొట్యాడ రెడ్డి బాబు(ఆనందపురం1)
బోద అప్పలరాజు, వార్డ్ మెంబర్ కోరాడ దామోదరరావు, బోద నారాయణ అప్పడు, నడిమింటి అప్పలరాజు, తాడి జగదీష్ కూడా పాల్గొన్నారు.
అనంతరం స్థానిక పి.హెచ్.సి లో గల రోగులకు కోరాడ నాగభూషణరావు ఆర్థిక సాయంతో రొట్టెలు,పాలు అందజేశారు.
రిపోర్టర్
జి. రవి కిషోర్