ఆనందపురం
జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న వ్యాధి నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు టిడిపి యువ నాయకుడు వేములవలస పంచాయతీ ఉపసర్పంచ్ నవీన్ జ్ఞానేశ్వర్ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మూడవ దశ పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇప్పటికే కేసులు ఎక్కువయ్యాయని పూల మార్కెట్ లో భౌతిక దూరం మాస్కులు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు.
రేపటి నుండి వేములవలస పంచాయతీ కార్యాలయంలో బూస్టర్ డోస్ వాక్సినేషన్ వేయడానికి అంతా సిద్ధంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ హెచ్ గోవింద్ రావు, ఏఎన్ఎం ఉమా, గౌరీ లు సహాయ సహకారాలు అందించారు.