విశాఖపట్నం మాధవధార నివాసి గేదెల వరలక్ష్మి కి 10 లక్షలు నష్టపరిహారం చెక్కును అందజేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు

09-11-2021 వ సం లో మాదవదార జంక్షన్ కూడలిలో లో గేదెల సూర్యనారాయణ 39 సం అనే వ్యక్తి ప్రమాదవశాత్తు  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి పోలీస్ రక్షణ ( ఎస్కార్ట్ ) కాన్వాయ్ కి ఎదురుగా వచ్చి పడిపోయి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయాం మా కుటుంబం ని ప్రభుథ్వం తరుపున ఆదుకోండి అని అడగగానే మంత్రి వర్యులు ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటానని మాటివ్వడం చేసారు. మాటిచ్చిన ప్రకారం ఈరోజు 25-01-2022 న ఆ కుటుంబం కి ప్రభుత్వం తరుపున 10 లక్షలు రూ. చెక్కును ఈరోజు గేదెల సూర్యనారాయణ భార్య అయిన శ్రీమతి గేదెల వరలక్ష్మి కి మంత్రి వర్యులు అందివ్వడం జరిగింది. అదే విదంగా ఆనందపురం జం. కి 1 కిలో మీటర్ దూరంలో 75 గజముల ఇంటి స్థలం , పెద్ద కుమార్తె కు గవర్నమెంట్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంత తొందరగా న్యాయం జరుగుతుంది  అనుకోలేదు అలాంటిది మంత్రి గారు చొరవ తీసుకొని చరిత్ర లో ఇదే తొలిసారి త్వరగా న్యాయం చేయడం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి కి నా కుటుంబం అంతా బుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.