పత్రికా ప్రచురణార్థం
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, సంయుక్త కార్యాచరణ పిలుపు మేరకు ఈరోజు భీమిలి మండలం లోని తాటితూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులంతా ఏడో తారీఖు నుండి పదో తారీకు వరకు నల్ల రిబ్బనలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని , కార్యక్రమంలో భాగంగా
ఈ రోజున లంచ్ అవర్ డిమాన్ స్టేషన్ జరిగిందని తాటితూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్రీనివాసరావు గారు తెలిపారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అదనపు కార్యదర్శి టి ఎస్ వి ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఉద్యమ కార్యాచరణ చేపట్టడం
జరిగిందని ముఖ్యంగా పిఆర్సి, 7ఏ బకాయిలు ,మరియు సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జిపిఎఫ్ మరియు ఏపీ జి ఎల్ ఐ డిమాండ్ల సాధనకై ఈ పోరాటం గత నాలుగు రోజులుగా సాగుతుందని వివరించడం జరిగింది. ఆయన పిలుపునిస్తూ మనమందరం నిలుద్దాం - ఉద్యోగుల ఐక్యత చాటుదాం ,
చేయి చేయి కలుపుదాం మన హక్కులను కాపాడుకుందామని తెలిపారు ఉపాధ్యాయులు ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి ఎం నాయుడు ,కిషోర్ ,చంద్రశేఖర్, మురళీధర్ ,ప్రభావతి, విజయ కుమారి ,పి ఎస్ ఎస్ లక్ష్మి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పి శ్రీనివాసరావు
భీమిలి రిపోర్టర్