Bipin Rawat: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలింది.
కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌బేస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది.
ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్ దంపతులు సహా పదమూడు మంది మృతిచెందినట్లు వాయుసేన అధికారికంగా ధ్రువీకరించింది.