జనసేవ పత్రికా ప్రచురణార్థం
భాషోత్సవాలు లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాటితూరు లో హిందీ భాషోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగినది.
ప్రధానోపాధ్యాయులు డి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో హిందీ ఉపాధ్యాయులు టి. ఎస్. వి. ప్రసాద్ రావు నిర్వహించారు విద్యార్థులకు హిందీలో కహాని పడనా, వక్తృత్వం, వ్యాసరచన, బాల్ గీత్, అంత్యాక్షరి, బోధనోపకరణాల తయారీ మొదలైన అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం అం జరిగింది.
భాషోత్సవాలు ను ప్రభుత్వం నిర్వహించడం హర్షణీయమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అదనపు కార్యదర్శి టి ఎస్ వి ప్రసాద్ రావు భాషోత్సవాలు విద్యాలయాల్లో జరపడం వల్ల విద్యార్థులకు అనేక భాషల పట్ల అవగాహన ఏర్పడుతుందని , మానసిక ఉల్లాసం, కార్యదక్షత, నాయకత్వ లక్షణాలు, ఏర్పడతాయని అన్నారు .
ఇవి వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు, విశాఖపట్నం జిల్లాలో డి. ఈ.ఓ .గారి ఆధ్వర్యంలో వందరోజుల భాషోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ భాషోత్సవాలు లో ఆంగలం, తెలుగు, హిందీ ఉపాధ్యాయులు రోజు కూడా పిల్లలకు సంబంధించిన వివిధ రకాల పదాలు నేర్పిస్తున్నారు.
వీటి వలన విద్యార్థులులో భాషాభివృద్ధి జరుగుతుందని పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. ఉత్సవాల్లో పుస్తక ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇలాంటి కార్యక్రమాల రూపకల్పన పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
సైన్స్ ,మ్యాథ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసేందుకు నిధులు విడుదల చేసినట్లు హిందీ క్లబ్ ఏర్పాటు చేయడానికి కూడా నిధులు విడుదల చేయాలని కోరారు హిందీ భాషను అభివృద్ధి చేయడానికి విద్యార్థుల్లో ఉత్సుకతను పెంపొందించడానికి హిందీ ఉపాధ్యాయుడు చేసిన కృషిని ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాసరావు, అప్పలనాయుడు, ప్రభావతి, సునీత, మురళి,శేఖర్, కిషోర్,కామేశ్వరి తదితరులు అభినందించారు.
రిపోర్టర్ పి శ్రీనివాసరావు