విశాఖపట్నం జనసేవ న్యూస్:
విశాఖపట్నం విమానాశ్రయం నుండి ఈ రోజు నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభయ్యాయి.
ఈ రోజు విశాఖపట్నం నుండి సింగపూర్ కి స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం ప్రారంభమైంది.
విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ గారి చేతులు మీదగా మొదటి విమాన ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్ ఇచ్చారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ గారు మాట్లాడుతూ త్వరలోనే దుబాయ్, మలేషియా, శ్రీలంక కి కూడా విమాన సర్వీసులు ప్రారంభించడానికి సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాస రావు గారు, అడ్వైసరీ కమిటీ సభ్యులు సిరట్ల శ్రీనివాస్ గారు, నరేష్ గారు, స్కూట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారు క్యాంప్ ఆఫీస్ మీడియా విభాగం
లా సన్స్ బే కాలనీ
విశాపట్నం.