జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ :

ఢిల్లీ :  దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు.  ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కచ్చితంగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.  ఒమిక్రాన్ పై భారతీయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. 


కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపేథ్యంలో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రధాని చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ జనవరి నుంచి ప్రారంభం అవుతుందని, దీని వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు.
 దేశంలో 18 లక్షల ఐసోలేషన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
4లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయని, పిల్లల కోసం ప్రత్యేకంగా 90 వేలకు పైగా బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, దేశంలో గత జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైందని, దేశంలో అర్హులైన 61 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందన్నారు.