ఆదర్శప్రాయుడు బాలి సన్యాసప్పడు (చిన్న కరణం)


జనసేవ ఆనందపురం : మండలంలోని తర్లువాడ గ్రామానికి చెందిన బాలి సన్యాస ప్పడు ఆదర్శప్రాయుడని పలువురు కొనియాడారు ఈనెల 5వ తేదీన ఆయన అకాల మృతి చెందడంతో తర్లువాడ గ్రామం ప్రజలు పెద్దదిక్కు కోల్పోయినట్లు పలువురు చర్చించుకున్నారు.

ఈ నెల 21 మంగళవారం తర్లువాడ గ్రామంలో తమ స్వగ్రామం వద్ద పెద్దకర్మ జరిపించుటకు కుమారుడు బాలి రవిశంకర్ ,అల్లుడు మాజీ సర్పంచ్ మజ్జి వెంకట్రావు ,మనవరాలు ఆనందపురం మండలం ఎంపీపీ డాక్టర్ మజ్జి శారద ప్రియాంక అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు.

ఆదర్శప్రాయుడు చిన్న కరణం: తర్లువాడ గ్రామంలో బాలి రామన్న కుమారులు బాలి సన్యాస ప్పడు, బాలి అయ్యప్ప(మాజీ సర్పంచ్) .పెద్దవాడు బాలి సన్యాస ప్ప డు చిన్న కరణంగా మండలంలో గుర్తింపు పొందారు.

వేముల వలస గ్రామంలో 18 సంవత్సరాలు గ్రామ కరణం గానూ, తగరపువలస 5 సంవత్సరాలు విలేజ్ అసిస్టెంట్ గాను,విశాఖపట్నం రామ టాకీస్ వద్ద 7 సంవత్సరాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ గా పలు పదవులు చేపట్టారు.

గ్రామ ప్రజలు సమస్యలు భూ సమస్యలు పరిష్కరించడంలో గ్రామ పెద్దగా ముందుండేవారు .స్నేహశీలి నీతి నిజాయితీ అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా అధికారుల నుండి ప్రజల నుండి  ప్రశంసలు పొందేవారు.

2004లో ఆయనకు పెరల్ సిస్ వచ్చినప్పుడు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు తర్లువాడ డాక్టర్ కొంగర రమేష్ గారు సరైన వైద్యం  అందించారు.
గుండె సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు విశాఖపట్నం వైద్యులు డాక్టర్ జ్ఞానేశ్వర్ రావు వైద్య సేవల అందించారు .ఇటీవల ఆస్తమా వ్యాధితో బాధపడుతూ డిసెంబర్ 5 న  ఆదివారం మధ్యాహ్నం 1:40 కి పరమపదించారు.

ఈ మేరకు ఈనెల 21  మంగళవారం తర్లువాడ గ్రామంలో పెద్దకర్మ జరిపించుటకు కుమారుడుబాలి  రవిశంకర్, అల్లుడు మజ్జి వెంకట్రావు, మనవరాలు ఆనందపురం మండలం ఎంపీపీ డాక్టర్ మజ్జి శారద ప్రియాంక, తమ్ముడు బాలి అయ్యప్ప అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

శంకర్రావు
 రిపోర్టర్