భీమిలి పట్నం జనసేవ:-
ఏపీ జేఏసీ పిలుపుమేరకు ఏపీ ఎన్జీవో స్ చైర్మన్ ఎం ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో గురువారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,కాంట్రాక్టు ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది తో భీమునిపట్నం తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్ ఈశ్వర్ రావు మాట్లాడుతూ పిఆర్సి 55 శాతం ఫిట్మెంట్ తో ప్రకటన చేయాలని.
సిపిఎస్ రద్దు చేసే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు.
జి పి ఎఫ్ ఏపీ జిఎల్ ఐ బోనస్ లను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ డి ఏ లను వెంటనే విడుదల చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ వై నూకరాజు కె ముత్యాలరావు స్థానిక తహసిల్దార్ కే.ఈశ్వవరావు, రెవెన్యూ సిబ్బంది టీచర్స్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
జనసేవ న్యూస్ రిపోర్టర్
పి శ్రీనివాసరావు