రాష్ట్ర విద్యార్థి నాయకుడిగా లెంక సురేష్ ప్రమాణస్వీకారం


  *ఆనందపురం* :  రాష్ట్ర తెలుగునాడు విద్యార్థి సమైక్య  అధికార ప్రతినిధిగా భీమిలి నియోజకవర్గానికి చెందిన లెంక సురేష్ ను ఇటీవల నియమించడం  జరిగింది. 
దీనికి సంబంధించి విజయవాడ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల తో రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పట్టాభిరామ్, గౌతు శిరీష, రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో శుక్రవారం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. 

ప్రమాణ స్వీకారం అనంతరం లెంక సురేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతానని, రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజబాబు గారికి, కింజరాపు అచ్చెన్నాయుడు కి ,అలాగే టిడిపి శాసన సభ్యులు అందరికీ మరియు ప్రణవ్ గోపాల్ కి   ధన్యవాదాలు తెలియజేశారు.

రిపోర్టర్
 సురేష్