*ఆనందపురం* :
జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలలో విశాఖపట్నం జిల్లా కు చెందిన విద్యార్థులు సత్తాచాటారని విశాఖపట్నం మార్షల్ ఆర్ట్స్ జిల్లా కార్యదర్శి లెంక అప్పలరాము తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 26 నుండి 30వ తేదీ వరకు గోవా మార్గోలో మనోహర్ పారికర్ స్టేడియంలో 22వ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ 2021-22 సంవత్సర పోటీలు జరిగాయని, ఈ పోటీలలో సుమారు 26 రాష్ట్రాలకు చెందిన 1500 మంది హాజరయ్యారు అని అన్నారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు వారి ప్రతిభను కనిబరిచారని, ఖవంకే కట విభాగంలో రౌతు మనోజ్ కుమార్ , లోబ అండర్-14 విభాగంలో లెంక హర్షవర్ధన్ కాంస్య పతకాలను గెలుపొందారన్నారు.
పతకాలు సాధించిన విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ జాతీయ అధ్యక్షులు నజీర్ అహమ్మద్ మీర్ చేతుల మీదుగ పతకాలను ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్పోర్ట్స్ అథారిటీ గోవా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.ఎం.ప్రభుదేశాయ్ వచ్చి ఈ లాంటి క్రీడల వలన మనకు మనం రక్షించుకోవచ్చు అని అన్నారు.
అనంతరం ఇందులో గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మార్షల్ ఆర్ట్స్ జాతీయ చైర్మన్ ఇస్మాయిల్, కార్యదర్శి ఇబ్రహీం, వివిధ జిల్లాల మాస్టర్స్, కోచ్ లు పాల్గోన్నారు అని లెంక అప్పలరాము తెలిపారు.
జనసేవ రిపోర్టర్