ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (EMMA) విశాఖ జిల్లా అధ్యక్షులుగా భీమిలి కి చెందిన మొకర శ్రీనివాస్

ప్రెస్ నోట్:----

ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (EMMA) విశాఖ జిల్లా అధ్యక్షులుగా భీమిలి కి చెందిన మొకర శ్రీనివాస్ పదవీ భాద్యతలు చేపట్టిన నేపథ్యంలో భీమునిపట్నం ప్రభుత్వ అధికారుల ఫోరం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ ఘనంగా జరిగింది.

స్థానిక చిన్న బజారు లోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన ఈ సభకు MRO కె.వి.ఈశ్వరరావు, MPDO పి.వెంకట రమణ, భీమిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ G.V రమణ, జోనల్ కమీషనర్ S.V రమణ, APEPDCL ఎ.డి.ఇ P.శ్రీనివాసరావు, భీమిలి C.H.C డాక్టర్ సిద్దార్థ.దిద్దే, CHC ఫిజియో థెరపిస్ట్ శివ, పశువైద్యులు డాక్టర్ B.వెంకటరమణ, భీమిలి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ G. పద్మావతి తదితరులు పాల్గొని మాట్లాడుతూ....

. సమాజంలో మీడియా పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. అనతి కాలంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి వార్త కథనాలతో పాటు ఆశక్తి కరమైన.... 

సమాజానికి మరింతగా ఉపయోగపడే విషయాలను ప్రసారం చేయడంలో సాక్ష్యం టెలివిజన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని కొనియాడారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించి మెరుగైన సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం శ్రీనివాస్ కు శాలువ కప్పి... 

జ్నాపిక అందించడంతో పాటు...సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు. అంతకు ముందు ఈ కార్యమానికి ముఖ్య అథిదులుగా విచ్చేసిన భీమిలి, పద్మనాభం మండలాల MPPలు దంతులూరి వాసురాజు, K రాంబాబు, మరియు పద్మనాభం, భీమిలి ZPTCలు సుంకర గిరిబాబు, గాడు వెంకటప్పడు సభ నుద్దేశించి మాట్లాడారు. అనంతరం పూల మాలలు,దుశ్శాలువలతో సత్కరించారు.

 ఈ కార్యక్రమంలో...TDP రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, భీమిలి 3వ వార్డు YSRCP నాయకులు.షణ్ముఖ రావు, మాజీ కౌన్సలర్ మైలపల్లి.లక్ష్మణరావు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కదిరి జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.

భీమిలి రిపోర్టర్
పి శ్రీనివాసరావు