జగన్ రెడ్డి గజిబిజి పాలనతో సామాన్యుల బ్రతుకులు ప్రశ్నార్థకంగా తయారయ్యాయని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ బంకులవద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా భీమిలిలో కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాట తప్పను - మడమ తిప్పను అని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ విషయంలో కూడా సామాన్యులను మోసం చేస్తూ వస్తున్నారని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటానికి కారణం నారా చంద్రబాబునాయుడు కారణమని సాగదీసి.. చెప్పి ప్రజలను నమ్మించారని అన్నారు. ఇలాంటివి ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేడు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉండేవి నేడు ఎంత పెరిగాయని అన్నారు.
నాడు పెరగడానికి చంద్రబాబు నాయుడు కారణమయితే నేడు చమురు ధరలు పెరగడానికి కారణం జగన్ రెడ్డి కాదా...? అని నిలదీశారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరడానికి కారణం కేంద్ర ప్రభుత్వమని రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర మంత్రులు చేత పనికిమాలిన మాటలు చెప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చమురు ధరలుమీద వ్యాట్ రూ.5 నుండి రూ 10 తగ్గించాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా వారికుండే పరిధిని బట్టి 7రూ నుండి 10 రూపాయలు వరకు తగ్గించాయని మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ఇది సామాన్య ప్రజలను మోసం చేయడం కాదా..? అని అడిగారు. వైసిపి ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎంతమంది మేధావులు నిలదీస్తున్నా ..
మీ సొంత పేపర్ సాక్షి పత్రికలో మాత్రం అబద్దాలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఒకపక్క వైసిపి ప్రభుత్వ అరాచకాలు, మరోపక్క సాక్షి పత్రిక తప్పుడు వార్తలకు నిరసనగా ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన కార్యక్రమంలో సాక్షి పత్రికను తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తగలబెట్టడమైనది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అద్యక్షులు గంటా నూకరాజు, విశాఖ రైతు సంఘం నాయకులు డి.ఏ.ఎన్.రాజు, 2,3 వార్డు కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా అప్పలకొండ, కసిరెడ్డి దామోదరం, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులు గోడి అరుణ, కురిమిన లీలావతి, పైడిపల్లి ఎల్లయ్యమ్మ, పుక్కళ్ళ లక్ష్మి కుమారి, నాయకులు శరగడ అప్పారావు, పాసి కుమార్, గండిబోయిన పోలిరాజు, పెంటపల్లి యోగీశ్వరావు,,మారోజు సంజీవకుమార్, కొక్కిరి అప్పన్న, రాజగిరి రమణ, అప్పీకొండ నూకరాజు, కంచెర్ల కామేష్, వాడమొదలు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
భీమిలి రిపోర్టర్
పి శ్రీనివాసరావు