విద్యార్ధులపై జగన్ రెడ్డి లాఠీచార్జ్ చేయించడాన్ని ఖండిస్తున్నాం : లెంక సురేష్


 *ఆనందపురం* : అనంతపురం ఎస్.ఎస్.బి.ఎన్ కళాశాలలో ఎయిడెడ్ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జగన్ రెడ్డి లాఠీచార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం 

అని తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలను కాపాడుకోవాలి

 అని శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్ధినులపై విచక్షణా రహితంగా దాడి చేయడం హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే ప్రభుత్వం తుగ్లక్ విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని, 


నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం దేశంలోనే 19వ స్థానానికి పడిపోయింది అని అన్నారు.
ఎయిడెడ్ పాఠశాల లను తొలగించాలి అని దుర్భుద్ది వలన సుమారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకం కానుంది అని, 

ఇప్పటికైనా ప్రభుత్వం ఎయిడెడ్ పై తుగ్లక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 అనవసరంగా విద్యార్థుల జోలికి వస్తే  ప్రభుత్వాలనే కూలదోసిన చరిత్ర విద్యార్ధులకు ఉంది అని గుర్తుచేశారు.

Reporter
సురేశ్