ఆనందపురం మండలం గొట్టిపల్లి లైన్ మేన గా పనిచేస్తున్న మల్లు బంగారు రాజును అతి కిరాతకంగా హత్య చేసిన హంతకులను అరెస్టు చేసి విచారణ జరిపి తక్షణమే శిక్షించాలని సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్ ఎస్ ఎన్ మూర్తి యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మృతుడు బంగార్రాజు భార్య చెప్పినట్లుగా వైఎస్ఆర్సిపి నాయకుడు కోదాడ లక్షణ కుమారు
ఈ హత్యలో భాగస్వామిని తెలుస్తుంది కాబట్టి అరెస్టు శిక్షించాలి మంత్రి సత్తిబాబు మేనల్లుడు అని పాలక పార్టీ నాయకుడిని వదిలిపెడితే పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది
అని కనుక అసలు హంతకుడిని అరెస్టు చేసి పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగించాలని కోరుతున్నాం భవిష్యత్తులో ఇటువంటి సంస్కృతి ఈ ప్రాంతంలో రానివ్వకుండా చూడాలని పోలీస్ వ్యవస్థ ని కోరుచున్నాం
ఈ హత్య ఘటనను నిరసిస్తూ తగరపువలస లో బైపాస్ నుండి మార్కెట్ వరకు ర్యాలీ చేసి అనంతరం రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ రాస్తారోకో యాదవ సంఘం నాయకులు నేలతో రాము పళ్ళ అప్పారావ్ కంచు బోయిన రాము సిఐటియు నాయకులు రవ్వ నర్సింగ్ రావు ఎస్ అప్పలనాయుడు పాల్గొన్నారు
రిపోర్టర్ భీమిలి
శ్రీనివాస రావు