తప్పు చేసిన తిమ్మయ్య గారి పల్లి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి! సిపిఎం కెవిపిఎస్ నాయకులు డిమాండ్!! 8 న చిట్వేల్ ఎండిఓ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయండి!!
కడప జిల్లా చిట్వేల్ మండలం తిమ్మయ్య గారి పల్లి పంచాయతీ కార్యదర్శి, తప్పు చేసిన పెంచలయ్య ను, సస్పెండ్ చేసి, శిక్షించాలని, బుధవారం రైల్వే కోడూర్ విలేకర్ల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సి హెచ్ చంద్రశేఖర్, డిమాండ్ చేశారు. తిమ్మయ్య గారి పల్లి సచివాలయ విషయంలో, అగ్రవర్ణాల తో కుమ్మక్కై, తప్పుడు రికార్డులు సృష్టించిన, ఎం ఈ ఓ స్పెషల్ ఆఫీసర్ జయ వేలును గత నెల 23, తేదీన ఆర్జెడి ఆదేశాల మేరకు, డి ఈ ఓ సస్పెండ్ చేశారని, దీనికి హర్షం వ్యక్తం చేశారు, కానీ అసలు దీనికి ప్రధాన కారకుడు పంచాయతీ కార్యదర్శి, అగ్రవర్ణాల పెంచలయ్య అని పేర్కొన్నారు. గతంలోనే రాజంపేట డీఎల్పీవో విచారణలో, గ్రామ సభ నిర్వహించకుండానే, నిర్వహించినట్లు సప్పుడు రికార్డులని సృష్టించారని విచారణలో వాస్తవమని కలెక్టర్ డి పి ఓ గారికి నివేదిక పంపించారు, ఆ మేరకు తక్షణమే అతన్ని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని ఆదేశించినా, సంబంధిత పై అధికారి డి పి ఓ గారు కాలయాపన చేస్తున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు. A1 ముద్దాయి నీ తప్పించి ,A2 ముద్దాయిని సస్పెండ్ చేశారని, దళితులకు ఒక న్యాయం అగ్రవర్ణాలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈనెల 8వ తేదీ లోపల అతన్ని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోని ఎడల చిట్వేల్ ఎం డి ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు, ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండల కన్వీనర్ పంది కాళ్ళ మణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిగే. చెన్నయ్య, కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.