మహిళ సాధికారత అంటే ఇదేనా - టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్

*విశాఖపట్నం* : నిన్న  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి పై అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని  తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయం లో  తెలుగునాడు విద్యార్థి సమైక్య నాయకులు, తెలుగు మహిళలు శాంతియుతంగా విన్నూత నిరసన తెలిపారు.

 ఈ నిరసనలో పోలీసులకు, విద్యార్థి నాయకులకు, మహిళలకు తోపులాట జరిగింది.
 ఆంద్రప్రదేశ్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ గారు ను పోలీసులు అక్రమంగా నిరసనను అడ్డుకోవడమేగాక, ప్రణవ్ గారు గొంతునులిమి క్రింద పడేశారు, కొంత మంది విద్యార్థి నాయకులకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. 

ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ జగన్ రెడ్డి జమానాలో పోలీసులు ప్రజాస్వామ్య హక్కులు మరచి ప్రతిపక్ష నేతలపై విరుచుకపడటం, జగన్ రెడ్డి అహంకారధోరణికి నిదర్శనం అని, తక్షణమే దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. 

మహిళా సాధికారత అని చెప్పే  ముఖ్యమంత్రి ఈ రోజు తన తల్లి లాంటి వయసున్న మహిళను కించపరుస్తుంటే ఆపకుండా వికిలి నవ్వులు నవ్వుతున్నారు అని ఎద్దేవా చేశారు.

 ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు అనంత లక్ష్మీ, రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు కనుమూరి లీలావతి, రాష్ట్ర  టిఎన్ఎస్ఎఫ్ నాయకులు లెంక సురేష్ ,ఎర్రంశెట్టి కార్తీక్, విశాఖ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎస్ రతాన్ కాంత్ , ప్రధాన కార్యదర్శి జోష్ యాదవ్, జిల్లా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు  బోండా రవి ,కిషోర్ , బొచ్చ ప్రవీణ్ కుమార్, అవినాష్, దుర్గా ప్రసాద్ ,సాయి ,  బోని సురేష్, కోరాడ వైకుంఠ రావు తదితరులు పాల్గొన్నారు

రిపోర్టర్ 
సురేష్