*ఆఫ్రికా* :
ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఫ్రీటౌన్ లో ఆయల్ ట్యాంకర్ లీక్ అవుతుండటంతో ఇంధనం పట్టుకోవటానికి వందల మంది ట్యాంకర్ వద్దకు వెళ్లారు.
అదే సమయంలో వేగంగా వెళుతున్న ఓ బస్సు ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో సుమారు 91మంది అగ్నికి ఆహుతయ్యారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు, వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది.
Reporter
సురేశ్