విశాఖ మున్సిపల్ కమీషనర్ గుమ్మళ్ల సృజనగారు బదిలీ

విశాఖ మున్సిపల్ కమీషనర్ గుమ్మళ్ల సృజనగారు బదిలీ కావడంతో, ఆమెను గౌరవపూర్వకంగా కల్సిన 68వ వార్డ్ కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్.

విధి నిర్వహణలో చాకచక్యంగా, శక్తివంతంగా పనిచేసిన కమీషనర్ సృజన  అందరికీ స్ఫూర్తిదాయకులని, 

'విశాఖ కార్పొరేషన్'ను విజయవంతంగా, సమర్ధవంతంగా నడిపించడంలో ఆమెకు ఆమే సాటియని, కర్తవ్య నిర్వహణలో - రాజజీయ పార్టీలకు అతీతంగా, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, ఆమె పనిచేసిన తీరు అందరికీ ఆదర్శనీయమని, విశాఖ ప్రజలు ఆమెను ఎప్పటికీ మరువలేరని తెలిపారు. 
 

భవిష్యత్తులో కమీషనర్ సృజన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని, తిరిగి విశాఖకు "కలెక్టర్"గా రావాలని ఆకాక్షించారు.

Reporter

జయశ్రీ