ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు - టిఎన్ఎస్ఎఫ్ నాయకులు

 *ఆనందపురం* : 
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు చేయాలని ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి గతంలో మాదిరిగానే ఆఫ్ లైన్ లోనే అడ్మిషన్లు కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర నాయకులు లెంక సురేష్ అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విద్యార్థులకు కనీస అవగాహన కల్పించకుండా ఆన్ లైన్ అడ్మిషన్లు పెట్టడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.

 దీని వలన విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో చదువుకొనే స్వేచ్ఛను కోల్పోతున్నారు అని, అంతేకాకుండా దగ్గర కళాశాలలో సీటు రాకపోతే మహిళ, పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందని అన్నారు.

 ఇవన్నీ ఆలోచించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు పరిధిలోని ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ లకు గత నెల 12వ తేదీన ఇంటర్ అడ్మిషన్లు ఆఫ్ లైన్ విధానంలోనే జరపాలని వినతిపత్రం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు అని గుర్తుచేశారు. 

విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆవేదనను గౌరవ హైకోర్టు అర్ధం చేసుకొని ఆన్లైన్ అడ్మిషన్లు రద్దు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థి వ్యతిరేక విధానాలను మానుకోవాలి అని అన్నారు. 

ఈ సమావేశంలో కొర్రయి తేజ ఆశిష్, కోరాడ వైకుంఠ రావు, పైల రమేష్, కొమ్ము సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్