యలమంచిలి- జనసేవ పత్రికా
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టిటిడి ఆర్థిక సహాయంతో నిర్మించిన దేవాలయాల్లో వినాయక చవితిని పురస్కరించుకుని బాల వికాస కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది మండలంలో కొక్కిరాపల్లి శివారు రెల్లి వీధి కాలనీలో రాంబిల్లి మండలం కొత్తపేట ఎస్సీ కాలనీ మునగపాక మండలం చూచుకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, మెల్లిపాక గ్రామం ఎస్సీ కాలనీ రామాలయం లో బాల వికాస్ కేంద్రం లు ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర ధర్మ ప్రచారక్ గంగాధర్ మాట్లాడుతూ సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణమైన దేవాలయాల్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 30 దేవాలయాల్లో బాలవికాస్ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది అన్నారు . విద్యార్థులను ను సంస్కారవంతంగా తయారు చేసేందుకు ఈ బాల వికాస కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ కన్వీనర్ పీ రంగారావు మాట్లాడుతూ దేవాలయ కేంద్రంగా బాలవికాస్ కేంద్రాలు ప్రతిరోజు రెండు గంటలపాటు నడుస్తాయని వీరికి చదువుతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పుతూ బాల బాలికలను చిన్ననాటినుండే సంస్కారవంతంగా నడిపేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యాయ కన్వీనర్ అళ్ల వెంకట శివ, డివిజన్ కో కన్వీనర్ అర్జున్ రావు, గ్రామ కన్వీనర్ చిన్న బ్బాయి, పోల రౌతు చిన్న నాయుడు, దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎర్రంశెట్టి నాగరాజు, అర్చకుడు నర్సింగ్ రావు మాతాజీ బంగారు నాగలక్ష్మి, గ్రామ ధార్మిక జట్టు పాల్గొన్నారు.
Reporter
సన్యాసినాయుడు