*నిర్వాసితులకు అన్యాయం చేస్తే చూస్తూ ఉరుకొము* *నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం*

*ఉక్కు నిర్వాసితుల సంఘం నాయకులు మంత్రి శంకరనారాయణ*
 విశాఖ ఉక్కు కోసం వేలాది ఎకరాలు త్యాగం చేసిన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకూ పోరాటాలు చేస్తామని . 

*గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి* 

 సూచనల మేరకు మండలంలోని నడుపూరు లో రజక వీధి. నాయిబ్రాహ్మణ వీధిలో ఉంటున్న ఉక్కు నిర్వాసితులు, నిరుద్యోగల వివరాలను గురువారం సేకరించారు. 

అలాగే వారి ఆర్‌ కార్డుల నెంబర్లు, ఎంప్లాయీమెంట్‌ నెంబర్లు తీసుకొని ఇప్పటి వరకు ఎంప్లై మెంట్ జరిగి ఎలాంటి ఉపాధి లేకుండా ఏ ఆదారంలేకుండా మిగిలిపోయిన వారి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం పాటు నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి.న్యాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నిర్వాసితులు నిరాశ చెందవద్దని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. 

నిర్వాసితులు కూడా ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగరపు రాంబాబు.చిక్కాల శ్రీను.మాటూరు దేముడు.పల్లం గోపి.కప్పరాడ సూరి.చిక్కాల సత్తిబాబు.మడక నాగరాజు.కె కుమార్.వెంకయమ్మ.ఎరుకులమ్మ.చినతల్లి.విజయ తదితరులు పాల్గొన్నారు.

గాజువాక రిపోర్టర్
జయశ్రీ