యలమంచిలి,(జనసేవ న్యూస్):
యలమంచిలి మండల పరిషత్ నూతన పాలక వర్గంతో శుక్రవారం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి టీ.దాసు ప్రమాణ స్వీకారం చేయించారు.
కో ఆప్షన్ సభ్యులు గా సిద్ధ సూకేశ్వరరావును నియమించగా, ఎన్నికైన 7 ఎంపీటీసీలతో పాటు కో ఆప్షన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, అనంతరం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షులుగా బోదెపు గోవిందరావును సభ్యులంతా ఆమోదించగా, ఉపాధ్యక్షులుగా రాజాన చంద్ర శేషగిరిరావు (శేషు) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎంపికైన ఎంపీపీ గోవింద, వైస్ ఎంపీపీ శేషు, ఎంపీటీసీలను, కో ఆప్షన్ సభ్యుని స్థానిక ఎమ్మెల్యే యువి రమణమూర్తిరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ సుకుమారవర్మ, పట్టణ పార్టీ అధ్యక్షులు బోద్దపు ఎర్రయ్యదొర, మున్సిపల్ వైస్ చైర్మన్ లు బెజవాడ నాగేశ్వరరావు, ఆరేపు గుప్తా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి, కమిషనర్ తోట కృష్ణవేణి, తహశీల్దార్ శ్రీనివాసరావు, జెడ్పిటీసీ శిలపరశెట్టి సంధ్యారాణి, కర్రి శివ పాల్గొన్నారు.
Reporter
నాయడు