ఉద్యోగ ధర్మాన్ని మరచి రాజకీయ నాయకుల కు పనిచేస్తున్న పోలీసులు -కౌంటింగ్ ఏజెంట్ తమ్మిన నర్సింగ్ రావు


భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో తమ్మిన నర్సింగ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జరిగిన ఎంపీటీసీ, ZPTC ఎన్నికల ఫలితాలో వైస్సార్సీపీ అధికార దుర్వినియోగం చేసింది.

ప్రభుత్వ అధికారులు కూడ అధికార పార్టీ కి తొత్తులు గా పనిచేస్తున్నారు. 

నేను ప్రత్యక్షంగా చూసాను. ఇటువంటి చేతకాని గెలుపు కూడా ఒక గెలుపేనా అంటూ ప్రశ్నించారు.

 ప్రజాస్వామ్యం లో అధికారులు నిస్పక్షపాతం గా పనిచేసినప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతోంది.
అధికారులు సిగ్గులేకుండా అధికార పార్టీ కి తొత్తులు గా బ్రతుకుతున్నారన్నారు. 

ప్రభుత్వ అధికారులు నీతి నిజాయితీ కోసం పనిచేయాలని అన్నారు.
 తమ్మిన చిన్నమ్ములు పై రౌతు శ్యామల వైసీపీ అభ్యర్థి 18 ఓట్ల మెజార్టీతో గెలుపుపొందారు అని ప్రకటించటం దారుణం అని, కనీసం అభ్యర్థి సంతకం కూడా తీకోలేదని, రీకౌంటింగ్ చేయమని అడిగితే కుదరదని దిక్కున్నోడికి చెప్పుకో అన్నారని తమ్మిన చిన్నమ్మలు తెలిపారు. మరోపక్క అధికార పార్టీ కి సంభందించిన వ్యక్తులకు మాత్రం కౌంటింగ్ కేంద్రం లోకి ఫోన్లు అనుమతి ఇచ్చారని, 

అదే విధంగా  అధికార పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ కౌంటింగ్ హాల్ లో దగ్గర ఉండి మరి కౌంటింగ్ జరిపించుకున్నడని ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం చెప్పకుండా బయటకు పంపించేశారని ఆరోపించారు.

 దీని పై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయ స్థానం ద్వారా సిసి పుటేజ్  ఆధారాలు సేకరించి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.  

అధికార పార్టీ కి పోలీసులు కూడా సపోర్ట్ చేయడం చాలా సిగ్గు చేటు కలిగిస్తుందని,

పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని
జనసేన అభ్యర్థి తమ్మిన చిన్నమ్ములు, కౌంటింగ్ ఏజెంట్ తమ్మిన నర్సింగ్ రావు తెలిపారు..

Reporter
సురేశ్