ఆనందపురం జనసేన న్యూస్
రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేసి సమ న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. ఆయన స్థానికంగా ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు.
అన్ని వర్గాల వారిని కలుపుకొని సంక్షేమ పథకాలు అందించడం పట్ల ప్రజలు వైకాపా పాలన పై ఎంతో విశ్వాసంతో ఉన్నారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే విధంగా వ్యూహరచన చేశారని కొనియాడారు. అతని ఆలోచనలకు పరిపాలనా విధానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
నిరంతరం ప్రజల కోసం పని చేసే వ్యక్తిగా సీఎం జగన్ మన్ననలు పొందడం పట్ల కొన్ని పార్టీలు అసహనంతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఇది గమనించడం విశేషమని తెలిపారు. అనంతరం మంత్రి అవంతి,జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యం, మాజీ ఎంపీపీ కోరాడ వెంకట్రావు,
గండ్రేడ్డి శ్రీనివాస్ రావు లతోపాటు సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, అధికారులు పాల్గొన్నారు.
జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )