కాప్స్ రాక్స్ యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

*కాప్స్ రాక్స్ యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు* : 
 *పెందుర్తి* : రాబోవు కరోన థర్డ్ వేవ్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ప్రభుత్వ ఆసుపత్రిలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా విశాఖపట్నం కాప్స్ రాక్స్ యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగు వేరువేరు ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 12 హైడ్రాలిక్ బెడ్స్ పంపిణీ చేశారు. 
కాప్స్ రాక్స్ ఫౌండర్ పెదిరెడ్డి శివభాస్కర్ గారి ఆశీస్సులతో సీడ్స్ మెంబర్, ఉత్తరాంధ్ర రిలియన్స్ జియో మేనేజర్ శ్రీ గౌరి ప్రసాద్ గారి సౌజన్యంతో విశాఖపట్నం కాప్స్ రాక్స్ యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ సభ్యులు పెందుర్తి 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో 4- హైడ్రాలిక్ బెడ్స్ పంపిణీ చేశారు. 
అనంతరం గోపాలపట్నంలో లక్ష్మీనగర్ నాలుగు కొలయుల వద్ద గల అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 5- హైడ్రాలిక్ బెడ్స్, NAD వెల్ నెస్ కేంద్రం వద్ద గల అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 2- హైడ్రాలిక్ బెడ్స్, కొత్తపాలెం ఆరోగ్య కేంద్రంలో 1- హైడ్రాలిక్ బెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి మెడికల్ సూపర్డెంట్ డా.పూరేంద్ర బాబు, హెల్త్ ఇన్స్పెక్టర్ పుష్ప రాజ్, డా.రేవతి, డా. రోజారాణి, డా. జయదీప్, డా.పూజా, విశాఖపట్నం జిల్లా కాప్స్ రాక్స్ యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ ప్రతినిధి పెద్దమళ్ల నవీన్, సభ్యులు తసుబెల్లి శంకర్ నాయుడు, కరణం కళావతి, వబ్బిన శ్రీకాంత్, ఎర్రంశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్