👉 *మా సహకారం ఎప్పుడూ ఉంటుంది*
👉 *అధికారపక్షానికి లేఖ రాస్తా*
👉 *ప్రాంతీయ పత్రిక ఎడిటర్ కు అండగా ఉంటా..*
👉స్థానిక పత్రికలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది..
👉ఏపీ ఎస్ఎస్ సమావేశంలో,. *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ*
*విజయవాడ* జనసేవ పత్రికా
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా క్షేత్రంలో నిత్యం తిరుగుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి చేరవేస్తూ వారధిగా ఉన్న జర్నలిస్టులకు,స్దానిక పఁతికల ఎడిటర్లకు అఁకిడేషన్ ఇవ్వకపోవడం , జిఎస్టి విధించడం అన్యాయమని ప్రాంతీయ పత్రికల ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మీకు అండగా మేముంటాం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు.
విజయవాడలోని హనుమాన్ పేటలోని దాసరిభవన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదక సంఘం (APSS)ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ* మీ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని అవసరమైతే అందరం కలిసి పోరాటం చేద్దామని న్యాయమైన కోర్కెలను తీర్చాలని ఆయన అన్నారు. ప్రాంతీయ పత్రికలకు ఆర్థికంగా ఆదుకుని వారికి చేయూతనివ్వాలని త్వరలో ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఎంతో కష్టపడితే గానీ చిన్న పత్రికలు నేడు ప్రచురించడం కష్టతరం అని కరోనా తో మృతి చెందిన ఎడిటర్ ల పాత్రికేయుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాంతీయంగా ఉంటే చానళ్లను పత్రికలను అన్నకు దక్కేందుకు ఈ ప్రభుత్వం చూస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కే.ప్రసాద్ బాబు, నందిగాం కోటేశ్వరరావు, కాకర్ల రమేష్, వల్లూరు రవిశేఖర్, శ్రీనివాసరావు , తాతారావు, లలితా దేవి, కాకి లేటి దుర్గారావు, రత్న రావు, కేతన సత్యనారాయణ., తదితరులు పాల్గొన్నారు