ఆనందపురం:జనసేవ న్యూస్
గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు నిర్వహించే గ్రామస్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశము లో భాగంగా వెల్లంకి గ్రామం నకు వ్యవసాయ శాఖ జె.డి.ఎ. శ్రీమతి లీలావతి గారు హాజరై ప్రస్తుతం ప్రతీ రైతు కూడా విధిగా ఆన్లైన్లో పంటనమోదు సచివాలయం లో వ్యవసాయ
సిబ్బంది ద్వారా తప్పనిసరిగా చేయించు కోవాలని,వ్యవసాయ శాఖ ద్వారా ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలు తెలుపుతూ, ఆర్. బి. కె ద్వారా అందిస్తున్న ఎరువులు, పురుగు మందులను అవసరం మేరకు వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం నూతన రైతుభరోసా కేంద్రం నిర్మాణం స్థితి గతులను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత సిబ్బందికి తెలిచేయటం జరిగింది. అనంతరం గ్రామం లో 100%రాయితీ లో ఎన్.ఎఫ్.ఎస్.ఎమ్ స్కీం ద్వారా పంపిణీ చేసిన కంది పొలాలను సందర్శించటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం లో ఎ.డి.ఎ సుబ్రహ్మణ్యం , మండల వ్యవసాయధికారి బి. శివ కోమలి,ఎ.ఒ.రవి,వి.ఎ.ఎ రమేష్, గ్రామ సర్పంచ్ రైతులు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )