ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ జర్మనీతో జరిగిన మ్యాచ్ లో తిరుగులేని విజయం సాధించి కాంస్య పతకాన్ని ముద్దాడింది.
బలమైన ప్రత్యర్థి పై అద్భుతంగా ఆడి 5-4 తేడాతో చిత్తు చేసి, అఖండ భారతావనిని మురిపించి, టోక్యో లో భారత కీర్తి పతాకాను రెపరెపలాడించింది. దాదాపు 41 ఏళ్ల తరువాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. ఒలింపిక్ చరిత్రలో 1928 నుండి 1964 వరకు వరుస ఎనిమిది పతకాలు అందుకుని రికార్డు సృష్టించిన భారత్, చివరి సారిగా 1980 మాస్కో ఒలింపిక్ క్రీడల్లో వాసుదేవన్ భాస్కరన్ నేతృత్వం లో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
హాకీ భారతదేశం జాతీయ క్రీడ అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంది. ఈ విజయం తో ఎన్నెళ్లో నుంచో ఎదురుచూస్తున్న భారతదేశ ప్రజల కలలను మాన్ ప్రీత్ సింగ్ సేన నిజం చేసింది. మొత్తం మీద ఈ పతకంతో ఒలింపిక్ క్రీడల్లో ఎనిమిది బంగారు పతకాలు, ఒక రజత పతకం, ఒక కాంస్య పతకం భారత్ సొంతం చేసుకుంది. దీనితో దేశ హాకీ అభిమానులు శభాష్ ఇండియా అంటున్నారు.
Reporter
Suresh