టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మదర్ థెరిసా జన్మదిన వేడుకలు

 *ఆనందపురం* : వంద మందికి నువ్వు సహాయ పడలేకపోవచ్చు కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు అని ప్రపంచ ప్రజలకు మంచి సందేశాన్ని అందించిన మహానీయురాలు మదర్ థెరిసా అని తెలుగునాడు విద్యార్థి సమైక్య జిల్లా నాయకులు కోరాడ వైకుంఠరావు అన్నారు. 
మండలంలోని గిడిజాల గ్రామంలో మానవతావాది, నోబెల్ శాంతి, భారతదేశ అత్యున్నత పురస్కరమైన భారతరత్న అవార్డు గ్రహీత మదర్ థెరిసా జన్మదిన వేడుకలను తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా గారి ఫొటోకు పూలమాల వేసి ప్రపంచ వ్యాప్తంగా ఆ మాతృమూర్తి చేసిన సేవలను గుర్తుంచుకున్నారు. అనంతరం తెలుగునాడు విద్యార్థి సమైక్య నాయకులు లెంక సురేష్ మాట్లాడుతూ మదర్ థెరిసా గారు మన దేశం కాకపోయినా మన దేశ పౌరసత్వం పొంది కలకత్తా లో మిషనరీస్ ఆఫ్ చారిటీ ని స్థాపించి 45-సంవత్సరాల పాటు మన దేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ పేదలకు, రోగగ్రస్తులకు, అనాధలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఈమెకు తన మానవసేవకు గాను 1979 లో నోబెల్ శాంతి పురస్కారంతోను, 1980లో భారతదేశ అత్యున్నత పురస్కరమైన *భారతరత్న* తో దేశ ప్రభుత్వం ఆమెను సత్కరించింది అని గుర్తుచేశారు. ఇలా ఎన్నో ఎనలేని సేవా కార్యక్రమాలతో మనకు *అమ్మ* అయిన ఆ *మదర్* జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రి ఉదయ్ కుమార్, సవరవల్లి రాజేష్, షిణగం శ్రీను, షిణగం మని, కోరాడ రాజు తదితరులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్