కి *లేడీ*.... పెళ్లైన మూడు రోజులకే గర్భవతి

 *విశాఖపట్నం* : 

ఓ వైపు ప్రియుడితో ఎఫైర్ సాగిస్తూనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది ఓ మాయ కిలేడీ. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం లోని గాజువాక ప్రాంతానికి చెందిన నంబారు రేణుక అనే యువతికి కొంత కాలం క్రితం జగదీష్ అనే వ్యక్తితో పెద్దలు పెళ్లి చేశారు. అయితే పెళ్లైన మూడు రోజులకే ఆమె గర్భవతి అని తేలడంతో భర్త ఆమెను వదిలేసాడు. అప్పటికే శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించిన రేణుక అతనితో హద్దులు దాటడంతో గర్భం దాల్చింది. 

ఈమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీనివాస్ వాయిదా వేస్తూ కాలం గడిపాడు. ఈలోగా రేణుక పాపకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా మరోవైపు శ్రీనివాస్ వేరే యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రేణుక నెలదీయడంతో పాప బాధ్యత తాను చూసుకుంటానని, కొంత నగదు కూడా డిపాజిట్ చేస్తానని సర్దిచెప్పి పెద్దలు చూసిన అమ్మాయిని శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడు. 

రేణుక ను వదిలించుకొనే క్రమంలో శ్రీనివాస్ కు ఒక నీచమైన ఆలోచన వచ్చింది. వెంటనే రేణుక ను పిలిచి తన ఆలోచనను వివరించాడు. శ్రీనివాస్ పిన్ని కొడుకు ప్రసాద్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి ఫోటోలు, ఫోన్ నెంబర్ రేణుక కు ఇచ్చి ప్రసాద్ ను లైన్లో పెట్టమన్నాడు. రేణుక వెంటనే ఫోన్లో ప్రసాద్ తో పరిచయం పెంచుకొని, శ్రీనివాస్ చెప్పిన ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తూ ప్రసాద్ ను లైన్లో పెట్టింది. పెద్దలకు చెప్పకుండా అతడ్ని రహస్యంగా పెళ్లి చేసుకొనేటట్లు చేసింది. 

ఆర్మీ ఉద్యోగ రీత్యా లక్నో లో ఉంటున్న ప్రసాద్ తన వెంటే తల్లిదండ్రులకు తెలియకుండా లక్నో కి రేణుక ను కాపురానికి తీసుకొని వెళ్ళాడు. కొంతకాలం కాపురం చేసిన తరువాత తనకు జివిఎంసి లో ఉద్యోగం వచ్చిందని తన భర్త ప్రసాద్ ను నమ్మించి వైజాగ్ వచ్చిన రేణుక మళ్ళీ ప్రియుడు శ్రీనివాస్ తో సహజీవనం చేసింది. ఈలోగా కరోన వలన ప్రసాద్ వైజాగ్ రాలేకపోయాడు కానీ తరచు భార్య రేణుక తో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు.

 కొంత కాలం తర్వాత తనకు ఆరోగ్యం బాగాలేదు అని లక్షల్లో చికిత్స కు ఖర్చు అవుతుంది అని భర్త ను నమ్మించి డబ్బులు తీసుకుంది. తరువాత తన తల్లికి బాగోలేదు అని మరి కొన్ని లక్షలు, ఇలా చికిత్సల పేరుతో మొత్తం సుమారు 45- లక్షలు వరకు మింగేసింది. చివరకు అమ్మ చనిపోయింది అని చెప్పి ప్రసాద్ ను నమ్మించింది. ప్రసాద్ ఆర్మీ లో ఉండటం వలన అతనకు తెలియకుండా రేణుక విశాఖలో ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న సాయి అనే యువకుడిని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. 

ఇంతలో సెలవుల పెట్టి రేణుక రెండో భర్త ప్రసాద్ వైజాగ్ రావడం వలన రేణుక అసలు రంగు బయటపడింది, దీంతో ప్రసాద్ గాజువాక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Reporter
సురేశ్