ముగ్గురు వాలంటీర్లు తొలగింపు - ఎంపీడీవో

 *పాయకరావుపేట* : మండలంలోని అరట్లకోట, రాజగోపాలపురం గ్రామ పంచాయతీ లలో ముగ్గురు వాలంటీర్ లను తొలగిస్తున్నట్లు ఎంపీడీవో సాంబశివరావు తెలిపారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ప్రోటోకాల్ ఉల్లంఘన, విధుల పట్ల నిర్లక్ష్యం, లబ్ధిదారుల పై వ్యక్తిగత దూషణ, సచివాలయ సిబ్బంది పై దురుసుగా ప్రవర్తన, పని విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరించటం, వాలంటీర్ గా ఉంటూ వేరే చోట పనిచేయడం వంటి కారణాలతో అరట్లకోట, రాజగోపాలపురం సర్పంచులు పులగపూరి అప్పలనరసమ్మ, యన్నంరెడ్డి లోవరెడ్డిలు వాళ్ళ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు వాలంటీర్ ల పై ఫిర్యాదు చేశారు. 

వీరి ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహించామని అనంతరం అరట్లకోట వాలంటీర్ మలకా కృష్ణ ప్రసాద్, రాజగోపాలపురం వాలంటీర్లు రాగాల రాజశేఖర్ రెడ్డి, నీలాపు మోహన్ సత్యనారాయణ రెడ్డిలను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశామని ఎంపిడివో తెలిపారు.

Reporter
సురేశ్