వైఎస్ ఇచ్చిన మాట వల్లే జగన్ – భారతి పెళ్లి..

వైఎస్ ఇచ్చిన మాట వల్లే జగన్ – భారతి పెళ్లి.. 25 ఏళ్లకు బయటకొచ్చిన నిజం 
#JaganweddingAnniversary

సీఎం జగన్ – భారతి పెళ్లి రోజు ఆగస్ట్ 28వ తేదీ. 1996లో కడప జిల్లా పులివెందులలోని లయోలా కాలేజీ ఆవరణలో ఎంతో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. 2021 ఆగస్ట్ 28వ తేదీకి సరిగ్గా 25 ఏళ్లు అవుతుంది వీరి పెళ్లి జరిగి. అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు. దీంతో జగన్- భారతితోపాటు తన ఇద్దరు కుమార్తెలతో సిమ్లాలో కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు సీఎం జగన్. ఓ భర్తగా, తండ్రిగా కుటుంబానికి సమయం ఇచ్చి.. తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు సీఎం జగన్. 25 ఏళ్ల తర్వాత జగన్ – భారతి పెళ్లి ఎలా జరిగింది.. కారణాలు ఏంటీ అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వైఎస్ భారతి తల్లిదండ్రులు గంగిరెడ్డి, సుగుణరెడ్డి ఇద్దరూ డాక్టర్లు. కడప జిల్లాలోనే పేరున్న వైద్యులు. భారతి తల్లి సుగుణరెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి డాక్టర్ చదువుకున్నారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి – సుగుణరెడ్డి అన్నా చెల్లెల్లుగా ఉండేవారు. ఆ తర్వాత వీరి చదువులు పూర్తయ్యాయి.. పెళ్లిళ్లు అయ్యాయి.. పిల్లలు పుట్టారు. ఓ ఫంక్షన్ లో రాజశేఖర్ రెడ్డి – భారతి తల్లిదండ్రులు కలుసుకున్నారు. ఈ సందర్భంలో సుగుణమ్మ.. నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారు వైఎస్. దీనికి భారతి తల్లి సుగుణమ్మ.. అన్నా మాట ఇస్తున్నావ్.. తప్పవు కదా అని ప్రశ్నించిందంట. రాజన్న మాట ఇచ్చాడమ్మా.. నీ కూతురు భారతి నా ఇంటి కోడలు అని చేతిలో చెయ్యి వేసి చెప్పాడంట రాజశేఖర్ రెడ్డి. ఈ మాట ఇచ్చింది 1982 సంవత్సరంలో..


 
ఆ తర్వాత భారతి తల్లిదండ్రులు గంగిరెడ్డి – సుగుణరెడ్డి ఇద్దరూ డాక్టర్లు ఎంతో బిజీ అయిపోయారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం రాజకీయాల్లో బిజీ అయ్యారు. జగన్ కు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గంగిరెడ్డి – సుగుణరెడ్డి కుమార్తె భారతిని ఇంటి కోడలు చేసుకుంటానని మాట ఇచ్చాను.. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని జగన్ కు చెప్పారంట వైఎస్.. మరో మాట లేకుండా ఓకే చెప్పారంట జగన్. అలా జగన్ – భారతి పెళ్లి 1996 ఆగస్ట్ 28వ తేదీన పులివెందులలోని లయోల కాలేజీ ఆవరణలో జరిగింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి.. జగన్ తాత రాజారెడ్డి.. గంగిరెడ్డి దగ్గర వెళ్లి నా మనవడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని సంప్రదాయబద్దంగా అడిగారంట. వాళ్లు అంగీకరించటం.. పెళ్లి పెద్దగా రాజారెడ్డి అన్నీ తానై.. దగ్గరుండి మనవడు వైఎస్ జగన్ పెళ్లి జరిపించటం అన్నీ చకచకా జరిగిపోయాయి.


 
2021 ఆగస్ట్ 28వ తేదీకి జగన్ – భారతి వివాహానికి 25 ఏళ్లు కావటం.. ఇద్దరు పిల్లలతో సిమ్లాలో వేడుక వేసుకుంటున్నారు. రాజకీయాలకు దూరంగా.. ఓన్లీ ఫ్యామిలీ మధ్యనే జరుపుకుంటున్నారు.

జగన్ – భారతి పెళ్లి వేదికపైనే మరో పెళ్లి కూడా జరిగింది. అది ఎవరిదో కాదు.. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతది.